NTV Telugu Site icon

Harish Rao: ప్రపంచం ముందు దేశం పరువు పోతోంది.. బీబీసీ ఐటీ దాడులపై హరీశ్‌రావు

Harish Rao On Bbc

Harish Rao On Bbc

Minister Harish Rao On BBC IT Raids: బీబీసీ కార్యాలయంపై జరుగుతున్న దాడులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. బీబీసీ కార్యాలయంపై ఐటి దాడులు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ప్రసారం చేస్తే బీబీసీపై ఐటీ దాడులు చేయిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ దాడుల కారణంగా ప్రపంచం ముందు దేశం పరువు పోతోందని వ్యాఖ్యానించారు. వార్తల్లో తప్పుంటే ఖండించి, ప్రజలకు వాస్తవం తెలియజేయాలి కానీ.. ఇలా ఐటీ దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ఇప్పుడు రాజకీయాల్లో ఒక కాంగ్రెస్సోడు పేలుస్తా అంటే.. బీజేపోడు కూలుస్తా అంటున్నాడని చెప్పారు. కానీ.. కట్టేవాడు, నిర్మించేవాడే తెలంగాణ రాష్ట్రానికి అవసరమని చురకలంటించారు.

Suicide Attempt: నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు.. రక్షించిన పోలీసులు.. ఎలాగంటే..?

గతంలో ఆంధ్రావాళ్ళు తమ ప్రాంతంలో ఒక ఎకరం అమ్మి, తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, అందుకు పూర్తి భిన్నంగా మారిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్‌ వైద్య సేవల అంశంలో చివరి స్థానంలో ఉందని.. కానీ తెలంగాణ మాత్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. తెలంగాణకు వచ్చి, ఇక్కడి వైద్య సేవలపై కామెంట్లు చేసే కేంద్రమంత్రులు.. వారి రాష్ట్రాల్లోని వైద్య సేవలు గురించి ఆలోచన చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం 88 వేల పోస్టుల భర్తీ చేయబోతున్నామని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తుంటే.. బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని పేర్కొన్నారు.

Ravanasura: దిల్ ఇస్తే… ఫుల్ ఇచ్చింది అంట… ఇది ‘మాస్’ బ్రేకప్ సాంగ్

యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ దేవుడిని వాడుకోదన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాదిలో 9 వైద్య కళాశాలలు రానున్నాయని.. వాటిలో ఒకటి యాదాద్రికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. బీజేపీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తోందని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‭ను ప్రారంభించబోతున్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Prithvi Shaw : సెల్ఫీ కోసం గొడవ.. క్రికెటర్ పృథ్వీ షా కారుపై దాడి!