Site icon NTV Telugu

Harish Rao Letter To Union Minister: కొవిడ్‌ టీకాల సరఫరా పెంచండి.. కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రి లేఖ..

Harish Rao Letter To Union Minister

Harish Rao Letter To Union Minister

Harish Rao Letter To Union Minister: కోవిడ్‌ టీకాల సరఫరా పెంచాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్సుఖ్‌ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు లేఖ రాసారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిషీల్డ్‌ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని.. ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని, కావున కోవిడ్‌ టీకాలను తక్షణమే పంపించాలని లేఖలో తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ 106 శాతం సాధించిందని తెలిపారు. రెండో డోస్‌ వ్యాక్సినేషల్‌లో 104 శాతం సాధించాలమని తెలిపారు. 18ఏండ్ల వయస్సు పై బడిన వారికి వాక్సినేషన్‌ లోనూ దేశంలోనే తొలిస్థానంలో తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు.

read also: Constitution of India : రాజ్యాంగం చెప్పిందేంటి..? జరుగుతున్నదేంటి..?

ఇప్పుడు ప్రికాషనరీ డోస్‌ విషయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యే డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించిందని హరీశ్‌ రావ్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్‌ మేరకు ప్రతీ రోజు 3లక్షల వరకు డోస్‌ లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ వాక్సిన్‌ కొరతతో రోజుకు కేవలం 1.5 లక్షల డోస్‌ లు మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, ప్రస్తుత డిమాండ్‌ మేరకు మాకు వాక్సిన్‌ సరఫరా కావడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోవిషీల్డ్‌ డోస్‌ లు కేవలం 2.7లక్షలు మాత్రమే వున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వెంటనే 50 లక్షల కోవిషీల్డ్‌ డోస్‌ వాక్సిన్‌ రాష్ర్టానికి పంపాలని లేఖలో తెలిపారు మంత్రి హరీశ్‌ రావు.
Adivasi Divas: వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

Exit mobile version