Harish Rao: నెల రోజులు సీరియస్ గా కష్ట పడాలని.. మేనిఫెస్టోను డోర్ టు డోర్ అతికించాలని మంత్రి హరీష్ రావ్ పార్టీ శ్రేణులకు సూచించారు. జలవిహార్ లో బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి లతో, వార్ రూమ్ సభ్యుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గోబెల్ ప్రచారం చేస్తున్నారు, వాటిని తిప్పి కొట్టాలని అన్నారు. మూడోవ సారీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని సర్వేలు చెప్తున్నాయన్నారు. మనం సీరియస్ గా నెల రోజులు కష్ట పడాలని సూచించారు. అవసరం అయితే రాత్రి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ పడుకోవాలని అన్నారు. మేనిఫెస్టో బలంగా తీసుకొని పోవడంలో కొంత వెనుక పడుతున్నాం.. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలని, డోర్ టు డోర్ జరగాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. సీఎం సభ జరిగి ప్రదేశాల్లో మేనిఫెస్టో అంశాలు ఫ్లెక్సీ లు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీదా మైండ్ గేమ్ ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిప్పి కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకూ తెలియపరచాలని మంత్రి అన్నారు.
తెలంగాణ తెచ్చి పింఛన్లు పెంచిన కేసీఆర్ మళ్లీ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తిరుపతి తరహాలో యాదాద్రి ఆలయాన్ని నిర్మించామని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఫ్లోరోసిస్ రహితంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి సౌత్ ఇండియాలోనే హ్యాట్రిక్ సాధించిన సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించాలని వారంతా ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో సరిపడా కరెంటు లేదని, రైతులంతా కలిసి మొసళ్లను తీసుకెళ్లి కరెంటు ఆఫీసుల్లో వదిలేశారని హరీశ్ రావు అన్నారు. సోనియాగాంధీని అవమానించిన వ్యక్తినే పీసీసీ అధ్యక్షురాలిగా నియమించి రాజకీయాలు చేయలేని భావ దరిద్రంలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో తుపాకీ గురిపెట్టిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేసి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడన్నారు.
Israel Palestine War: ‘పాలస్తీనియన్లను విడుదల చేయండి’.. ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు కొత్త తలనొప్పి