NTV Telugu Site icon

Minister HarishRao: వైద్య సేవలకు 100శాతం మార్కులు..మంత్రి హరీష్ కు అవ్వ ప్రశంసలు

Harish1

Harish1

తెలంగాణలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ వచ్చాక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల దశ తిరిగింది. బస్తీ దవాఖానాలు పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. పటాన్ చెరులోని ఏరియా ఆస్పత్రికి వచ్చిన వైద్య, ఆరోగ్యమంత్రి హరీష్‌ రావు అక్కడ వైద్యం అందుతున్న తీరు, రోగుల బంధువుల ఫీడ్ బ్యాక్ ఆనందాన్నిచ్చింది. నేను చదువుకోలేదు కానీ ఇక్కడి వైద్య సేవలకు వందకు వంద శాతం మార్కులు వేస్తా…అని ఓ అవ్వ ఇచ్చిన సమాధానం ఇది.

Supreme Court: నుపుర్ శర్మకు ప్రాణహాని ఉంది.. అప్పటి వరకు చర్యలు వద్దు.

పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడే వున్న ఓ అవ్వను అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఆయనకు ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి. బిడ్డ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన మహబూబ్ నగర్ కు చెందిన అవ్వ తన సంతోషాన్ని, సంతృప్తిని ఇలా వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి అందుకున్నాం … ఘనంగా పెళ్లి చేశాం. తర్వాత మనువరాలు పుట్టింది.. ఇక్కడి ఆసుపత్రిలో మంచి వైద్యం అందుకుంటున్నామని సంతోషంగా చెప్పింది అవ్వ. ఆమె మాటలకు ఆనందం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్బంగా ఆ బాలింతకు మంత్రి హరీశ్ రావు కేసీఆర్ కిట్ అందజేశారు. ఆర్థికశాఖతో పాటు వైద్యశాఖను సమర్థంగా నిర్వహిస్తున్న హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైద్యసేవలు అందుతున్న తీరుని ఆయన స్వయంగా పరిశీలించి, రోగుల నుంచి స్పందన తెలుసుకుంటున్నారు.

Minister Harish Rao: కేంద్రంలో ఉద్యోగాల మాటేంటి బండి?