Site icon NTV Telugu

Minister Harish Rao : బీజేపీ వాళ్లకు ఆ శాపం ఉందేమో..?

బీజేపీ నేతలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం హరీష్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న పాలమూరు మీటింగులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు.. బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందని ఆయన విమర్శించారు. కేంద్ర బీజేపీలో ఆధిపత్య పోరు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని.. గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెపితే, నాయకులు మరో మాట చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీది పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఇంకో పాట అని హరీష్‌ రావు అగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version