Site icon NTV Telugu

Minister Harish Rao: భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రంజాన్‌కి కానుకలు అందించలేదు.

Harish Rao

Harish Rao

Minister Harish Rao: భారత దేశంలో తెలంగాణ తప్పా ఏ రాష్ట్రం కూడా ముస్లింలకు రంజాన్ పండగ కానుకలను అందించలేదని, గత ప్రభుత్వాలు ముస్లింలకు పండగ కానుకను అందించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్ లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకలను హరీష్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పండగలకు సరుకులు అందిస్తున్నారమని ఆయన వెల్లడించారు.

Read Also: Bhatti Vikramarka: మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రిని అడిగి భజన శాఖ తీసుకోవాలి..

కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఉంటేనే అన్ని రంగాల్లో ముందున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమనే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. సిద్ధిపేట అన్ని రంగాల్లో ముందుంది అని వెల్లడించారు. తడి, పొడి చెత్త వేరు చేసి ప్రజలు మున్సిపల్ బండికి అందివ్వాలని సూచించారు. ఇళ్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదని, వీధులు కూడా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా మన ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు రంజాన్ పండగకు కానుకలను అందించలేదని విమర్శించారు.

Exit mobile version