యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట కేంద్రంలో చెన్నకేశవ స్వామి దేవాలయం పునర్ నిర్మాణ పనులు, అలాగే రామన్నపేట కేంద్రంలో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులు, నూతన ఎస్ఓటీ కార్యాలయ భవనాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయని పథకాలు తెలంగాణలో ఎలా అమలు చేస్తున్నారు అని ఆయన అన్నారు.
Read Also: Shukrayaan-1: శుక్రుడికి గురిపెట్టిన ఇస్రో.. అత్యంత ప్రకాశవంతమైన గ్రహంపై జీవం ఉందా?
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు.. 30 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు.. మనం వదిలేస్తే.. మనం విడి చేసిన నాయకులను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆయన మండిపడ్డాడు. కరెంటు రావడం లేదంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారి ప్లగ్ లో వేలు పెట్టి చూడాలి అంటూ చురకలు అంటించాడు. కరెంటు గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక అర్హత లేదు.. కాంగ్రెస్ మాట్లాడే దాని పైనే ప్రజల మధ్య చర్చ జరుగుతుంది.. దాని పైనే ప్రజల మధ్యకు వెళ్దాం మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు అంటూ హరీశ్ రావు వ్యాఖ్యనించాడు. త్వరలో అన్ని వర్గాల ప్రజలు శుభవార్త వింటారు.. కరెంటు గురించి.. ఉచిత కరెంటు గురుంచి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Also: Palla Rajeshwar Reddy: జనగామలో పల్లా వర్గమో, మరో వర్గమో లేదు, మనమంతా కేసీఆర్ వర్గం..
కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు వర్ణగాతీతం.. ఉచిత కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదు.. 3 గంటలు కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కు.. 24 గంటల కరెంటు కావాలంటే కేసిఆర్ కు ఓటేయండి.. అధికారంలోకి రాలేము అని తెలిసే గ్యారంటీలు ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇస్తామంటున్న గ్యారెంటీలు.. గతంలో ఎందుకు ఇవ్వలేదు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు లేవు.. రైతులు, దళితులు, ఉద్యోగులంతా కేసీఆర్ వైపు ఉన్నారు.. కేసీఆర్ కే అధికారం అని సర్వేలు చెప్తున్నాయి.. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి హరీశ్ రావు అన్నారు.