NTV Telugu Site icon

Harish Rao: మే 1న సీఎం నోట మరిన్ని శుభవార్తలు వింటారు.. ఉత్కంఠగా మంత్రి మాటలు

Minister Harish Rao

Minister Harish Rao

Harish Rao: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటి నుంచి త్వరలో మరో శుభవార్త వింటామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. మే 1న మేడే సందర్భంగా కార్మికులకు శుభవార్త ప్రకటిస్తామన్నారు. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు మంగళవారం (ఏప్రిల్ 11) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ రంగంలోని కార్మికులకు వరాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణ రంగంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కూలీలుగా పనిచేస్తున్న వారికి మేలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి హరీశ్ రావు వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకునే వారందరూ తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఏపీతో పోలుస్తూ.. ‘అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి.

Read also: Twitter Legacy: బ్లూ చెక్‌లను తొలగించేందుకు సిద్ధం.. డేట్ సెట్ చేసిన ఎలోన్ మస్క్

మీ ఓటును అక్కడు బంద్‌ చేసుకుని తెలంగాణలోనే రాసుకోండి’’ అని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని.. ఏపీలో కనీసం రోడ్లు కూడా బాగోలేదని.. తెలంగాణలో పనిచేస్తున్న కార్మికులు ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోండని ఆయన సూచించారు. అందరూ మావోలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏంటి తెలంగాణా కోసం తెలంగాణా అభివృద్ధిలో పాలుపంచుకునే ప్రతి కార్మికుడు తెలంగాణాలో అంతర్భాగమే వేరు కాదన్నారు. ఇక్కడే ఓటు రాసుకోండి అన్నారు. ఆడ, ఈడ పెట్టుకోకండి మళ్ల ఇక్కడ వుండేది పోతుందని సూచించారు. ఒక్కదిక్కే పెట్టండి అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య ఉత్కంఠగా మారాయి.
KTR Tweet: సవాల్‌ విసిరినా కానీ.. సైటెంట్‌ గా వున్నారు..

Show comments