Site icon NTV Telugu

Harish Rao: కంటి వెలుగు పథకం ఓట్ల కోసం పెట్టలేదు

Minister Harish Rao

Minister Harish Rao

Harish Rao: కంటి వెలుగు కావాలని ఎవరు చెప్పలేదని, ఓట్ల కోసం ఈ పథకం పెట్టలేదని మంత్రి హరీశ్‌ రావ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సదాశివపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కోటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా బెలూన్లను గాల్లో ఎగురవేసిన మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. జనవరి 18- 2023న ప్రారంభం అయిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నేటితో కోటి పరీక్షలు చేయించుకున్నారని ఆనందంగా ఉందని తెలిపారు. కంటివెలుగు పథకాన్ని ప్రతిపక్షాలు కూడా మెచ్చుకున్నాయని అన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ పథకాన్ని అభినందించారని తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇద్దరు ఈ పథకాన్ని మెచ్చుకున్నారని అన్నారు. 1500 మంది బృందం 25 రోజుల్లో 50 లక్షలు, 50 రోజుల్లో కోటి పరీక్షలు పూర్తి చేశారని తెలిపారు.

Read also: Bandi sanjay wife: ఎమోషన్స్ లేని ఈ ప్రభుత్వానికి “బలగం” సినిమా చూపించాలి

ఇవ్వాళ ఓ గొప్ప ఓ రోజు…నేటితో కంటివెలుగు పరీక్షలు కోటి పూర్తయ్యాయని అన్నారు. కంటి వెలుగు కావాలని ఎవరు చెప్పలేదు.. ఓట్ల కోసం ఈ పథకం పెట్టలేదని అన్నారు. కంటి సమస్యతో ఎవరు ఇబ్బంది పడొద్దని కేసీఆర్ అనుకున్నారని.. దేశంలో ఇంత పెద్ద పథకం ఎక్కడ లేదని మంత్రి తెలిపారు. డాక్టర్లే పేషేంట్ల దగ్గరికి వచ్చి పరీక్షలు చేస్తున్నారని అన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీరిచ్చి ఆడబిడ్డలకు తోబుట్టువుగా నిలిచారు కేసీఆర్ అన్నారు. సంక్షేమ పథకం అందని ఇల్లే లేదు తెలంగాణలో అని ఆనందం వ్యక్తం చేశారు. కోటి మందిలో 29 లక్షల మందికి కంటి సమస్య ఉన్నట్టు తేలిందని అన్నారు. రాష్ట్రంలో 55 శాతం గ్రామాల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తి అయ్యాయని అన్నారు. ఇంకో 50 రోజుల్లో 45 శాతం గ్రామాల్లో పూర్తి చేస్తామన్నారు. 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కంటి వెలుగు కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచినామని అన్నారు.

Read also: Bandi sanjay: బండి సంజయ్ పిటిషన్ విచారణ ఈనెల 10 కి వాయిదా

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 84 శాతం ప్రసవాలు అవుతున్నాయని తెలిపారు. మహేంద్ర నాథ్ అని కేంద్ర మంత్రి తెలంగాణకి వచ్చి నీతులు చెబుతాడని మండిపడ్డారు. ఆయనది యూపీ.. యూపీ వైద్యంలోనే చిట్టచివరన ఉందని ఎద్దేవ చేశారు. మొన్న నిర్మలా సీతారామన్ ని మహిళలు అడ్డుకుని గ్యాస్ ధరలపై నిలదీశారని గుర్తు చేశారు. ఇవ్వక ఇవ్వక తెలంగాణకు ఎయిమ్స్ మెడికల్ కాలేజి ఇస్తే నాలుగేళ్ళ నుంచి పనులు చేస్తనే ఉన్నారని అన్నారు. ఇప్పుడు మళ్లీ మోడీ వచ్చి కొబ్బరి కాయ కొడుతాడట! అంటూ వ్యంగాస్ర్తం వేశారు. మీరు ఒక్క మెడికల్ కాలేజి ఇవ్వకున్న 26 మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నామని చురుకలంటించారు. బీజేపీ వాళ్ళకి పని తక్కువ ప్రచారం ఎక్కువ అంటూ ధ్వజమెత్తారు. BRS ప్రభుత్వంది ప్రచారం తక్కువ పని ఎక్కువ అని ప్రసంసించారు. మనకి ప్రచారం అవసరం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు చెబుతారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.
Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు

Exit mobile version