యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు: గంగుల కమలాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని కేంద్రం తెలిపిందన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. పీయూష్ గోయల్‌ను కలిసిన సమయంలో రిక్వెస్ట్ చేస్తే ఆయన పట్టించుకోలేదని… లిఖిత పూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఎఫ్ సీఐ గోదాంలు నిండిపోయామని.. వాటిని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని పంపించలేదనే కేంద్రం వాదన సరికాదని ఆయన అన్నారు. తెలంగాణలో గోదాంలు నిండిపోవడంతో.. బీదర్, జగ్గయ్య పేటలోని గోదాంలను కేటాయించాలని గతంలో ఏడు సార్లు లేఖలు రాశామని వాటిపై కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్రానికి ఇష్టం లేదని అన్నారు. కిషన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతులపై పక్షపాతి ధోరణి తో వ్యవహరించడం సరికాదని గంగుల అన్నారు. ఇప్పటికైనా కేంద్రం మరోసారి ఈ అంశంపై పునరాలోచించుకోవాలని మంత్రి అన్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!