దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అక్కడికి అన్ని రాష్ట్రాల మంత్రులు వెళ్లినా కేటీఆర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారని, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తున్నదని గుర్తుచేశారు.
మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి తాము అసెంబ్లీని రద్దు చేయిస్తామని ప్రధాని మోదీకి, బీజేపీకి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. లోక్‌సభను రద్దు చేసే ధైర్యం బీజేపీకి ఉన్నదా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి తలసాని మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిందని, వారందరూ ప్రజల చేత ఎన్నికయ్యారని బీజేపీ గుర్తు పెట్టుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నా, కేంద్రంలో ఎందుకు లేదని నిలదీశారు. బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ శాఖనే ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు.
లోక్‌సభను రద్దు చేసే ధైర్యం బీజేపీకి ఉన్నదా? మేము సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అసెంబ్లీని రద్దు చేయిస్తాం. ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొందాం. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణ చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నది. మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా? అంటూ మండి పడ్డారు.
