పార్లమెంట్ లో 2022-2023 బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర బడ్జెట్ పైనా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అచ్చే దిన్ పోయి, సచ్చే దిన్ వచ్చేశాయని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్ లో అన్నీ కోతలే? ఉపాధి హామీకి 25వేల కోట్ల కోత. గ్రామీణాభివృద్ధి శాఖకు సైతం కేటాయింపుల తగ్గింపు.
మిషన్ భగీరథకు మరోసారి మొండి చేయేనని ఆయన మండిపడ్డారు. వ్యవసాయానికి సహాయ నిరాకరణ ఎరువుల ధరలకు రెక్కలొస్తాయని, విభజన హామీలకు తిలోదకాలేనా? అని ఆయన ప్రశ్నించారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ…బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏది అని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల ఇంత వివక్ష.. అవార్డులు.. ప్రశంసలే తప్ప.. రాష్ట్రానికి నిధులేవా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. మధ్యతరగతి వారికి బడ్జెట్ లో ఎలాంటి ప్రయోజనాలు లేవని ఆయన అన్నారు.