NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: ఆయన స్ఫూర్తితోనే రాజకీయంగా ఎదిగా..

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కాళోజీ నారాయణ రావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఇవాళ కాళోజీ 108వ జయంతి పురస్కరించుకుని హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని , నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాళోజీ తన గళాన్ని వినిపించారని చెప్పారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 25ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి భరతమాత ముద్దుబిడ్డ కాళోజీ నారాయణ రావు అని, కాళోజీ అందించిన స్పూర్తితోనే తాను రాజకీయంగా ఎదిగానని మంత్రి అన్నారు. కాళోజీ జన్మదినాన్ని సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా గౌరవిస్తోందన్న మంత్రి దయాకర్ రావు, ప్రతి ఏటా ప్రముఖ కవులను గుర్తించి కాళోజీ అవార్డులతో గౌరవిస్తున్నామని, అలాగే వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టామని ఆయన గుర్తు చేశారు. ఇక సీఎం కెసీఆర్ వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీ కి కాళోజీ పేరు పెట్టారు. అయితే.. ప్రస్తుతం హన్మకొండలో కాళోజీ కళా క్షేత్ర నిర్మాణం చేపట్టామని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి 6.32 లక్షల ఉచిత చేప పిల్లలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వదిలారు. అయితే.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలోని చెరువులను మిషన్‌ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశార‌ని గుర్తు చేశారు. కాగా, వాటిల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?