Errabelli Dayakar Rao: రాజకీయాల్లో నంబర్ వన్ ఎవరు.. ఆ తర్వత ఎవరు? అనే చర్చ సాగుతూనే ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో అది వివాదాలకు కూడా దారి తీస్తుంది.. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత నంబర్ ఎవరిది? అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది.. రెండు మూడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.. అయితే, అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ తర్వాత నేనే నంబర్ వన్ అంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987–88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు.. అందుకు తగిన కారణం కూడా చెప్పుకొచ్చారు.. తన తండ్రి సమితి అధ్యక్షునిగా పోటీ చేసినప్పుడు టాస్ వేసి కాంగ్రెస్ వారు ఓడించారని చెప్పుకొచ్చారు.. అలా రెండు సందర్భాల్లో ఆ పార్టీ వారు కక్ష గట్టడంతో కసితో.. తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు.. జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ఓడించాచని పేర్కొన్నారు..
Read Also: Dadisetti Raja: ఆర్ఆర్ఆర్‌కు వచ్చిన ఆస్కార్ కంటే పవన్ యాక్టింగ్ ఎక్కువ..! మంత్రి ఫైర్
ఇక, తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడిన ఎర్రబెల్ల దయాకర్‌రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ తర్వాత తానే సీనియర్‌ని అన్నారు.. తన అంత సీనియర్ ఇంకా ఎవరూ లేరన్న ఆయన.. వరుసగా 30 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.. కసికొద్దే రాజకీయాల్లోకి వచ్చా.. రాణించా.. గతంలో ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిగా భావించే సమితి ప్రెసిడెంట్ పదవికి తన తండ్రి పోటీ చేస్తే.. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరో వర్గంతో తన తండ్రిని ఓడించిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అలా కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ ను నాశనం చేయాలని కంకణం కట్టుకొని టీడీపీలో చేరా.. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా.. ఆ సమయంలో జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేలా చేశానని గుర్తు చేసుకున్నారు.. అయితే, ఎర్రబెల్లి తన రాజకీయ ప్రస్తానం.. తన అనుభవాలను చెప్పుకొచ్చినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత నేను సీనియర్.. నంబర్ వన్ తర్వాతే.. నంబర్ నాదే అనే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారాయి.