ఈ మధ్య కాలంలోయువత యాంత్రిక జీవనానికి బాగా అలవాటైపోయారు. ఊరుకుల పరుగుల జీవితం కావడంతో ఎవ్వరూ కూడా ఇంటి పట్టున్న ఉండి ఇంట్లో వండుకుని తినేంత సమయం లేదు. దీంతో చాలా మంది ఫాస్ట్ పుడ్‌కు బానిసలు అవుతున్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిలో 30 వయస్సు దాటకుండానే గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. రోజు ఫాస్ట్ పుడ్ తినే వారిలో మెటబాలిక్ డిజాస్టర్స్ వస్తాయి. కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హైపర్‌టెన్షన్, హైబీపీతో పాటు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో పాటు నీరంగా ఉండటం, ఆకలి వేయకపోవడం, తిన్నా సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఫాస్ట్‌పుడ్ మానేసి రోజుకు గంటసేపైనా ఎక్సర్‌సైజ్ చేయడం, పండ్లు కూరగాయాలను ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్లు, ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన మెటాబాలిజం రేటు పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. ప్రతి రోజు నీళ్లను బాగా తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు దరీ చేరనీయకుండా చూసుకోవచ్చు.