Site icon NTV Telugu

Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ విడుదల

Meenakshi

Meenakshi

Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పాదయాత్రల షెడ్యూల్ ప్రకారం, జూలై 31న పరిగి పట్టణంలో సాయంత్రం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర అనంతరం పరిగి లో రాత్రి బస చేయనున్నారు. ఆగస్టు 1న ఉదయం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఆంధోల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు.

Tummala Nageswara Rao : పత్తిరైతులకు గుడ్ న్యూస్.. బిల్లులు విడుదల..!

ఆగస్టు 2న శ్రమదానం కార్యక్రమంతోపాటు కార్యకర్తల సమావేశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు లో పాదయాత్ర చేపడతారు. ఆగస్టు 3న ఉదయం శ్రమదానం నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఖానాపూర్ లో పాదయాత్ర ఉంటుంది.

ఆగస్టు 4న ఉదయం శ్రమదానం అనంతరం కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం చొప్పదండి లో పాదయాత్ర చేసి రాత్రి బస చేస్తారు. ఆగస్టు 5న ఉదయం శ్రమదానం అనంతరం సమావేశం నిర్వహించి, సాయంత్రం వర్ధన్నపేట లో పాదయాత్ర చేపడతారు. చివరిగా ఆగస్టు 6న శ్రమదానం, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పాదయాత్రలను ముగిస్తారు.

Bollywood : సైయారా అరాచకం అన్ స్టాపబుల్.. ఇప్పటి వరకు ఎంత రాబట్టిందటే?

Exit mobile version