Medha School : మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు..
- 10 నెలలుగా డ్రగ్స్ తయారీ.. జయప్రకాశ్ గౌడ్ సంచలన చర్యలు
- టూ వీలర్ పై హైదరాబాదు, మహబూబ్‌నగర్, సంగారెడ్డికి సరఫరా
- కల్లు కాంపౌండ్ల యజమానులకు మత్తుమందు విక్రయం
- ఫ్యాక్టరీలో పేపర్ల మధ్య దాచి పెట్టిన 23 లక్షల రూపాయలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medha School : బోయినపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్ దాదాపు 10 నెలలుగా అల్ప్రాజొలామ్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తయారైన డ్రగ్స్‌ను జయప్రకాశ్ తన టూ వీలర్ ద్వారా సరఫరా చేస్తున్నాడు. సినీ పక్కిలాంటి ప్రాంతాల్లోనూ అతను డ్రగ్స్‌ను టూ వీలర్ పై తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – పలుమార్లు తనిఖీలు జరిగినప్పటికీ, డ్రగ్స్‌తో ఉన్న బ్యాగ్‌ను పోలీసులు చెక్ చేయలేదు. ప్రతి సారి వాహన లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ పత్రాలు మాత్రమే చెక్ చేసి వదిలేశారు.
Mirai: హనుమాన్ రికార్డులే కాదు స్టార్ హీరోల రికార్డులు బద్దలు కొట్టిన మిరాయ్
Also Read
హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, సంగారెడ్డికి కూడా జయప్రకాశ్ గౌడ్ టూ వీలర్‌పై డ్రగ్స్‌ను తీసుకెళ్లి విక్రయించినట్లు ఈగిల్ టీమ్ దర్యాప్తులో బయటపడింది. మహబూబ్‌నగర్‌లోని కల్లు కాంపౌండ్ యజమానికి పెద్ద మొత్తంలో మత్తుమందు అమ్మినట్లు సమాచారం. అరెస్టు అనంతరం ఫ్యాక్టరీలో జరిగిన సోదాల్లో, ఈగిల్ టీమ్ 23 లక్షల రూపాయలను రికవరీ చేసింది. ఆ మొత్తాన్ని జయప్రకాశ్ ఫ్యాక్టరీలో ఎక్కడ పడితే అక్కడ, పాత పేపర్ల మధ్య దాచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త విషయాలతో మేధా స్కూల్ డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?