Medha School : బోయినపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్ దాదాపు 10 నెలలుగా అల్ప్రాజొలామ్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తయారైన డ్రగ్స్‌ను జయప్రకాశ్ తన టూ వీలర్ ద్వారా సరఫరా చేస్తున్నాడు. సినీ పక్కిలాంటి ప్రాంతాల్లోనూ అతను డ్రగ్స్‌ను టూ వీలర్ పై తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – పలుమార్లు తనిఖీలు జరిగినప్పటికీ, డ్రగ్స్‌తో ఉన్న బ్యాగ్‌ను పోలీసులు చెక్ చేయలేదు. ప్రతి సారి వాహన లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ పత్రాలు మాత్రమే చెక్ చేసి వదిలేశారు.
Mirai: హనుమాన్ రికార్డులే కాదు స్టార్ హీరోల రికార్డులు బద్దలు కొట్టిన మిరాయ్
హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, సంగారెడ్డికి కూడా జయప్రకాశ్ గౌడ్ టూ వీలర్‌పై డ్రగ్స్‌ను తీసుకెళ్లి విక్రయించినట్లు ఈగిల్ టీమ్ దర్యాప్తులో బయటపడింది. మహబూబ్‌నగర్‌లోని కల్లు కాంపౌండ్ యజమానికి పెద్ద మొత్తంలో మత్తుమందు అమ్మినట్లు సమాచారం. అరెస్టు అనంతరం ఫ్యాక్టరీలో జరిగిన సోదాల్లో, ఈగిల్ టీమ్ 23 లక్షల రూపాయలను రికవరీ చేసింది. ఆ మొత్తాన్ని జయప్రకాశ్ ఫ్యాక్టరీలో ఎక్కడ పడితే అక్కడ, పాత పేపర్ల మధ్య దాచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త విషయాలతో మేధా స్కూల్ డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది.
