Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి మృతి.. అశ్లీల వీడియోలుతో..
- ఆగనీ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ..
- లోన్ యాప్ నిర్వాహకులకు వినోద్ బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan AppPraja Bhavan: వారం రోజుల క్రితం జీడిమెట్ల కు చెందిన విద్యార్థి బానుప్రకాష్ లోన్ యాప్ వేధింపులు భరించలేక ఫాక్స్ సాగర్ లేక్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే మరో ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ కు చెందిన M.వినోద్ భార్య మంజుషాదేవి ఇద్దరు పిల్లలతో కలసి సుచిత్ర సమీపంలోని శ్రీరాం నగర్ లో నివాసముంటున్న బోయిన్ పల్లి లో ఓ ప్రయివేట్ కంపెనీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తండ్రి అనారోగ్యంతో లోన్ యాప్ లో తన భార్య పోటో పెట్టి రూ.2514 తీసుకున్నాడు. ఆ డబ్బుల కూడా కట్టేశాడు. అయితే లోన్ యాప్ నిర్వాహకులు వినోద్ ఇంకా డబ్బులు కట్టాలని వేధించడం మొదలు పెట్టారు. లేదంటే ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించారు. రోజూ ఫోన్ చేసి వేధించడంతో వినోద్ తన భార్యకు తెలియకుండా రెండు లక్షల పైగా చెల్లించాడు. అయినా లోన్ యాప్ వేధింపులు తగ్గలేదు.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
Read also: Praja Bhavan: నేడు ప్రజావాణి రద్దు.. రేపటికి వాయిదా..
దీంతో విసుగు చెందిన వినోద్ ఇక నాదగ్గర లేవని ఇప్పటికే లోన్ చెల్లించడానికి అప్పుల పాలయ్యాయని తెలిపాడు. చెల్లించక పోతే ఫోటోలను బంధువులకు, స్నేహితులకు పంపుతామని లోన్ యాప్ నిర్వాహలకు బ్లాక్ మెయిల్ చేశారు. వినోద్ డబ్బుల కోసం బయట ప్రయత్నించినా ఎక్కడా కుదరలేదని.. ఇదే విషయాన్ని లోన్ యాప్ వారికి తెలిపిన పట్టించుకోలేదు. చివరకు లోన్ ఆప్ నిర్వాహకులు అన్నంతపని చేశారు.. వినోద్ ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న వీడియోలను , పోటోలను కుటుంబ సభ్యులకు పంపారు. దీంతో మనస్తాపం చెందిన వినోద్ ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆదివారం రోజున బార్యపిల్లలు కార్మిక నగర్ లో ఉన్న సోదరుని ఇంటికి పంపి నేను కూడ వస్తాను అంటూ చెప్పి పంపాడు. ఎవరు ఇంట్లో లేని సమయంలో వినోద్ ఆత్మహత్య పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Lalitha Sahasranamalu: లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే చాలు సర్వభోగాలు చేకూరుతాయి
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!