Meat Shops Closed: సండే అంటేనే ఫన్ డే అని. లేటుగా లేచి మనకు ఇష్టమైన వంటకాలు వండుకుని తిని సరదాగా గడుపుతాం. అయితే.. ఆదివారం అంటేనే ఆహారంలో నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు మాంసాహార ప్రియులు క్యూ కడతారు. ఆదివారాల్లో చాలా ఇళ్లలో నాన్ వెజ్ వంటకాలు వండుకోవడం.. వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలు చేస్తూ సండేను ఆస్వాదిస్తారు
Read also: Russia Ukraine War : రష్యాపై ఉక్రెయిన్ చావు దెబ్బ.. 50వేల మంది సైనికులు మృతి
చాలా మంది ప్రతి ఆదివారాన్ని నాన్ వెజ్ డేగా ప్రకటించి ఎంతో ఆనందిస్తారు కూడా. కానీ ఈ ఆదివారం హైదరాబాద్ ప్రజలకు మాంసం దొరకదు. ఈ నెల 21న నగరంలోని మటన్ దుకాణాలతో పాటు కబేళాలు, మాంసం, బీఫ్ మార్కెట్లను మూసివేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. జైనులు మహావీర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
జైనులు జరుపుకునే పండుగలలో, మహావీరుడు అత్యంత ముఖమైనవాడు. ఈ నేపథ్యంలోనే మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నాన్ వెజ్ షాపులను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వుల అమలులో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం యథావిధిగా మటన్, చికెన్, షాపులు తెరవవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రజలు సహకరిపంచాలని కోరారు. మాంసం షాపుల యజమానులు దీనిని గమనించి షాపులను బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వేళ కాదని తెరిచిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
