Site icon NTV Telugu

Mayor Vijayalakshmi : ఆ ఇండ్లను చూస్తుంటే సంతోషం క‌లుగుతుంది

హైదరాబాద్‌ మేయ‌ర్‌గా బాధ్యత‌లు స్వీక‌రించి సంవ‌త్సర కాలం పూర్తయిన సంద‌ర్భంగా.. ఈ ఏడాది కాలంలో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌పై ఓ బుక్‌లెట్‌ను మేయ‌ర్ గద్వాల్‌ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది కాలంలో న‌గ‌ర అభివృద్ధికి అనేక చ‌ర్యలు చేప‌ట్టిన‌ట్టు ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా 65 వేల ఇండ్ల‌ను పూర్తి చేశామ‌న్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా అనేక ఫ్లై ఓవ‌ర్లు నిర్మించామ‌ని, సీఆర్ఎంపీ కింద అన్ని జోన్ల‌లో రోడ్ల మ‌ర‌మ్మతులు చేప‌ట్టిన‌ట్లు ఆమె వెల్లడించారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద ముంపు స‌మ‌స్య ప‌రిష్కారిస్తామ‌ని హామీ ఇచ్చారు.

తొలిద‌శ‌లో రూ. 858 కోట్ల‌తో ఎస్ఎన్‌డీపీ ప‌నులు చేప‌డుతామ‌న్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 117 బ్లాకుల్లో నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్లను త్వర‌లోనే ల‌బ్దిదారుల‌కు అంద‌జేస్తామ‌ని ఆమె తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొల్లూరులో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించామ‌ని స్పష్టం చేశారు. ఆ ఇండ్లను చూస్తుంటే సంతోషం క‌లుగుతుంద‌ని ఆమె తెలిపారు. వ‌ర్షాకాలం నాటికి 52 ప్రాంతాల్లో ప‌నులు పూర్తి చేస్తామ‌ని పేర్కొన్నారు. కొత్తగా 21 ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జీలు నిర్మిస్తున్నామ‌ని ఆమె వెల్లడించారు.

Exit mobile version