NTV Telugu Site icon

Minister KTR: రైతులకు అన్యాయం జరగకుండా జగిత్యాలలో మాస్టర్ ప్లాన్

Minister Ktr

Minister Ktr

Minister KTR: జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ రైతులకు అన్యాయం జరగకుండా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ 4 వేల ఇండ్లతో నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన డబ్బా ఇండ్లు ఒక వైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఓ వైపు ఉన్నాయని తెలిపారు. ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతం… రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం మని అన్నారు. జగిత్యాలలో మంత్రులు చేయలేని పనులు MLA సంజయ్ చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాల 1956 లోనే మున్సిపాలిటీ.. దాని స్థాయిని దిగజార్చింది కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ రైతులకు అన్యాయం జరగకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సంజయ్ ని గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. ఇక్కడ మామిడి రైతులకు మేలు చేసేందుకు పెప్సీ కొకకోలా కంపెనీ యూనిట్ జగిత్యాలకు తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాలలో 20 ఎకరాల విస్తీర్ణం రూ. 40 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, నూకపెల్లిలో 280 కోట్లతో నిర్మించిన 4,520 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేసీఆర్ కాలనీ, మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్‌ను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, బాల్క సుమన్‌, సుంకె రవిశంకర్‌, విద్యాసాగర్‌రావు, ఎంపీ వెంకటేష్‌ నేతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Kukatpally LuLu Mall: లులు మాల్ ను దోచేసిన కస్టమర్లు.. ఫుడ్డుతో పాటు మొత్తం ఖాళీ