NTV Telugu Site icon

Bride’s Relatives Attack the Groom: పెళ్లి ఇష్టం లేక వరుడు హైడ్రామా.. ఏం నాటకాలు రా నాయనా..?

Attack

Attack

పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే అందరికీ గౌరంగా ఉంటుంది.. పిల్ల నచ్చిందని చెప్పి.. కట్నానికి ఓకే చెప్పి.. అందరినీ ఆహ్వాన పత్రికలు పంపించి.. తీరా పెళ్లికి అంతా సిద్ధమైన సమయంలో.. డ్రామా చేస్తే ఎవరికైనా మండిపోద్ది.. మరీ ముఖ్యంగా వధువు తరపు వారైతే ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం.. ఎందుకంటే.. పెళ్లి ఒకసారి ఆగిందంటే.. ఏం జరిగిందో..? అనే తప్పుడు ప్రచారం చేసే వాళ్లు వారి పక్కనే కాసుకు కూర్చుంటారు కాబట్టి.. అయితే, జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్థంతరంగా పెళ్లి ఆగిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఏం జరిగిందో తెలియదు. కానీ, పెళ్లి ఇష్టం లేక హైడ్రామా క్రియేట్ చేశాడు వరుడు.. చివరకు అసలు విషం తెలియడంతో.. ఆగ్రహించిన వధువు బంధువుల చేతిలో వరుడి దేహశుద్ధి తప్పలేదు.

Read Also: Dadisetti Raja: పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ అన్వేష్ తో జగిత్యాలకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.. నిన్న (ఆదివారం) పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి మండపానికి చేరుకున్న తర్వాత డ్రామా మొదలు పెట్టాడు అన్వేష్‌… తాను బాత్‌ రూమ్‌లో జారీ పడ్డానని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేరాడు.. కాలుకు రెడ్ బ్యాండ్ వేసుకుని హడావుడి చేశాడు.. ఇద్దరు సాయం చేస్తే గానీ నడవలేకపోతున్నట్టు.. తెగ యాక్టింగ్‌ చేశాడు.. ఇక, వరుడికి టెస్టులు, స్కానింగ్‌లు చేసిన డాక్టర్లు.. అతడికి ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చేశారు.. పెళ్లి కూతురు బంధువులు నిలదీయడంతో.. పెళ్లి తప్పేలా పరిస్థితి లేకపోవడంతో.. అప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు.. పెళ్లి ఇష్టం లేదని చెప్పేశాడు అన్వేష్‌.. పీటల వరకు వచ్చిన తర్వాత పెళ్లి ఇష్టంలేదని చెప్పడంతో ఆగ్రహించిన వధువు బంధువులు.. పెళ్లి కొడుకును చితకబాదారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.