Site icon NTV Telugu

Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. రేవంత్ తీరు సరిగ్గా లేదు

Marri Shashidhar Reddy

Marri Shashidhar Reddy

Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని కాంగ్రెస్‌లో కీలక నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని అన్నారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని తెలిపారు. ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. ఇన్చార్జులతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశాడని ఆరోపించారు. ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ అందుబాటులో ఉండడని మండిపడ్డారు.

Read also: Jaya Jaya Jaya Jaya Hey: తెలుగులో రాబోతున్న మలయాళ చిత్రం!

చెంచా గాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లాగే చాలామంది పార్టీని వీడే అవకాశం ఉందని అన్నారు. 3000 నుంచి 20వేల కు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమన్నారు. వచ్చే ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని తెలిపారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దని వారించిన వారిలో నేను ఒకర్ని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూణ్ణెళ్ల క్రితమే అధిష్టానానికి చెప్పానని అన్నారు. కాంగ్రెస్ నుంచి మారుతా అని అనుకోలేదని తెలిపారు. Always కాంగ్రెస్ మ్యాన్ ని అనుకున్నా కానీ.. తప్పని పరిస్థితుల్లో తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాజకీయ నాయకుణ్ణి, ఇంకా రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Andhra Pradesh: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ.3,940 కోట్ల రుణం మంజూరు

Exit mobile version