NTV Telugu Site icon

Marri Sashidhar Reddy: క్లౌడ్ బరస్ట్ లేదు ఏంలేదు.. కేసీఆర్ తెలివి అదేనా?

Marri Shashidhar

Marri Shashidhar

భారీ వర్షాలు పడడం అంతర్జాతీయ కుట్ర అని కేసీఆర్ చెప్పడం బాధాకరం. గతంలో క్లౌడ్ బరస్ట్ లడఖ్, ఉత్తరాఖండ్ లో జరిగిందని తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరిగిందని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి పంప్ లను అమర్చామన్నారు. 2009లో రోశయ్య కాలంలో వరదలు వచ్చినప్పుడు నాగార్జున సాగర్ వద్ద 20లక్షల క్యూసెక్ ల వరద వచ్చిన ఆ ప్రాజెక్టు తట్టుకుంది. 2009 లో లడఖ్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందన్నారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే..గంటకు వంద మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాలి.

ఐతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఉత్తరాఖండ్ లో కూడా క్లౌడ్ బరస్ట్ జరగలేదు. వర్షపాతాన్ని నిర్దిష్టంగా కొలిచే పరికరాలు మనవద్ద లేవు. విభజనకు ముందు రీజినల్ కేంద్రాలను పెట్టుకున్నాం. 2009లో కర్ణాటక, మహారాష్ట్రలో 30సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని శశిధర్ రెడ్డి తెలిపారు. ఆ వర్షానికి భారీ వరద మనకు వచ్చింది. నిన్న కేసీఆర్ పక్కనే వున్న సీఎస్ ఉండి ఏ సమాచారం ఇచ్చారు. తోకలెక్క కుర్చున్నాడా సీఎస్. విపత్తుల సమయంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలి ..అది చేయడం లేదు.

8 ఏళ్లు అయిపోయాక కూడా స్టేట్ స్థాయిలో విపత్తుల నిర్వహణ మీటింగ్ లు పెట్టడం లేదు. కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కు పట్టిన దురదృష్టం దేశానికి పడ్తుంది. కేసీఆర్ వద్ద ఏమైన సమాచారం ఉంటే కేంద్రానికి ఇవ్వాలని సలహా ఇచ్చారు. కేసీఆర్ ను బద్నాం చేయడానికి కాళేశ్వరంలో వరద వచ్చేలా చేస్తారని అనుకోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ అలా మాట్లాడ్డం సరికాదు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌ కి వర్షాలు ఎలా పడతాయో తెలీదా? అని ఆయన ప్రశ్నించారు.

Ben Stokes: ఇంగ్లండ్ జట్టుకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్

ఓరిజంటల్ మూమెంట్ ద్వారా సునామీ రాదని నేను NDMA వైస్ ఛైర్మెన్ గా వున్నప్పుడే చెప్పాను. నోటికి వచ్చినట్లు మాట్లాడితే బాగోదు. ఇలాంటి మాటలు మాట్లాడకండి.. ఇంకో పది వేల పుస్తకాలూ చదివితే ఆ తెలివి వస్తుందని సలహా ఇస్తున్నా. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ వచ్చిందంటే అది కూడా మా హయాంలో ఏర్పాటు చేసిందే. రానున్న రోజుల్లో నగరాల్లో పట్టణాల్లో భారీ వరదలు వస్తాయి.. దానికి సిద్ధంగా ఉండండి. రాష్ట్ర సర్కార్ విపత్తులు ఎదుర్కోడానికి వున్న గైడ్ లైన్స్ పాటించండి అని సలహా ఇచ్చారు.

Monkey Pox: దేశంలో రెండో కేసు నమోదు.. కేంద్రం హై అలర్ట్