NTV Telugu Site icon

Marredpally SI Vinay Kumar: సీఐపై కత్తితో దాడి.. నిందితులు అరెస్ట్

Marredpally Si Vinay Kumar

Marredpally Si Vinay Kumar

సికింద్రాబాద్‌ మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌పై దుండగులు కత్తితో దాడికి పాల్పడిన పవన్ సింగ్, సంజయ్ సింగ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిద్దరిపై పీడి యాక్టులున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. నిన్న మంగళవారం సుమారు రాత్రి 3 గంటల సమయంలో ఎస్‌ఐపై దాడికి పాల్పడ్డారు. మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో.. బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఎస్‌ఐ ఆపి.. వారిని ప్రశ్నించారు.

read also: Ryan Burl: ఒకే ఓవర్‌లో 6 6 6 6 4 6.. అదరగొట్టిన జింబాబ్వే క్రికెటర్

ఈక్రమంలో వారిలో ఓవ్యక్తి తనవద్ద ఉన్న కత్తితో ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ పై దాడి చేసాడు. ఎస్‌ఐని కత్తితో కడుపులో పొడిచి ఇద్దరు పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సీఐ పరిస్థతి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వరుసగా వారం రోజుల నుంచి పోలీసులపై కత్తులతో దాడి నగరంలో కలకలం రేపుతోంది. పోలీసులపైనే కత్తితో దాడిచేసేందుకు కూడా దుండగులు వెనుకాడటం లేదు. అయితే రక్షణ కల్పించే పోలీసులపైనే దాడికి పాల్పడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Astrology : ఆగస్టు 03, బుధవారం దినఫలాలు

Show comments