Maoists Surrender : తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా భావించదగ్గ పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాటమే మార్గంగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సైనిక విభాగం అయిన పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PGLA) చీఫ్ బర్సె దేవా, మరో 48 మంది అనుచరులతో కలిసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ భారీ లొంగుబాటు మావోయిస్టు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంలో పడేసింది. ఒకప్పుడు 41 మంది సభ్యులతో అత్యంత బలంగా ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ, వరుస ఎన్‌కౌంటర్లు , లొంగుబాట్ల కారణంగా ప్రస్తుతం కేవలం నలుగురు సభ్యులకు మాత్రమే పరిమితం కావడం ఆ పార్టీ పతన దిశకు సంకేతంగా కనిపిస్తోంది.
Speaker Ayyanna Patrudu: తెలుగు భాష కాదు.. మన సంస్కృతి.. జీవన విధానం… మన ఆచారం..
బర్సె దేవా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన వ్యూహకర్తగా పేరుపొందారు. ముఖ్యంగా అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, పార్టీ సాయుధ బలగాల బాధ్యతలను భుజాన వేసుకున్న దేవా, గెరిల్లా యుద్ధ తంత్రాలను అమలు చేయడంలోనూ , పార్టీకి అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. ఆశ్చర్యకరంగా హిడ్మా , బర్సె దేవా ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు నిర్వహించిన పక్కా ఆపరేషన్ ఫలితంగానే ఈ లొంగుబాటు సాధ్యమైంది.
నిన్న రాత్రి సరిహద్దు ప్రాంతం నుండి వీరిని సురక్షితంగా తరలించిన పోలీసులు, త్వరలోనే వీరికి అందే పునరావాస ప్యాకేజీల వివరాలను వెల్లడించనున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న దేవా వంటి నాయకుడు దూరం కావడంతో మిగిలిన నలుగురు సభ్యులపై తీవ్ర ఒత్తిడి పడనుంది. బర్సె దేవా లొంగుబాటు కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదు, అది ఒక సిద్ధాంత పోరాటంలో వస్తున్న మార్పుకు , మావోయిస్టు ఉద్యమ మనుగడ సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తోంది.
US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన యూఎస్..
