Maoists Surrender : తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా భావించదగ్గ పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాటమే మార్గంగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సైనిక విభాగం అయిన పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PGLA) చీఫ్ బర్సె దేవా, మరో 48 మంది అనుచరులతో కలిసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ…