Duddilla Sridhar Babu : మంథని నియోజకవర్గంలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన పలు ముఖ్య ప్రకటనలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.
“రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి నాంది పలికింది. ప్రతి అర్హ కుటుంబం సకాలంలో సన్న బియ్యం పొందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని అన్నారు. సన్న బియ్యం సరఫరా సక్రమంగా జరిగేలా రెవెన్యూ అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.
Rahul Gandhi: ‘‘చనిపోయిన అరుణ్ జైట్లీ ఎలా బెదిరించారు’’.. పప్పులో కాలేసిన రాహుల్ గాంధీ..
సన్న బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల సుమారు రూ. 3 వేల కోట్ల ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని తెలిపారు. అయినప్పటికీ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మంత్రి గుర్తుచేశారు. “ఉచిత బస్ ప్రయాణం అమలు చేయడం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 200 కోట్ల ఉచిత టికెట్లను ఉపయోగించుకున్నారు,” అని తెలిపారు.
అంతేకాకుండా, గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతీ నెల రూ. 6 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తున్నప్పటికీ, సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తున్నామని చెప్పారు.
మంథని అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి శ్రీధర్ బాబు, త్వరలో మంథనిలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అదనంగా, 10,200 మందికి కొత్త రేషన్ కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి. మంథనిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా కృతనిశ్చయం,” అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Uttar Pradesh: భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. “అపరిచితుడి” రూపంలో బిగ్ ట్విస్ట్..
