Site icon NTV Telugu

Telangana Govt: నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు

Tg Govt

Tg Govt

Telangana Govt: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version