Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- మణికొండ డాలర్ హిల్స్‌లో తెగిన లిఫ్ట్
- లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు
- ఇద్దరికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
- వైర్లు తెగి ఒక్కసారిగా 5వ అంతస్తు నుంచి కుప్పకూలిన లిఫ్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణికొండలోని డాలర్ హిల్స్‌లో శనివారం లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించడమే కాకుండా అపార్ట్మెంట్లోని నివాసితులను భయాందోళనకు గురిచేసింది.
డాలర్ హిల్స్‌లోని ఒక అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జీ కార్తీక్ రెడ్డి చేయబోయే పాదయాత్ర కు సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ ముగించుకుని ఆరుగురు నాయకులు గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తి, వైర్లు తెగిపోయాయి. దీంతో లిఫ్ట్ నేరుగా ఐదో అంతస్తు నుండి కిందకు కుప్పకూలిపోయింది. లోపల ఉన్న వారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఈ ప్రమాదంలో లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు నాయకులకు గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. లిఫ్ట్ వేగంగా కిందకు పడటంతో ప్రభావం ఎక్కువగా ఉండి ఇద్దరి కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అపార్ట్మెంట్ వాసులు, ఇతర నాయకులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని అత్యవసర చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!