కాంగ్రెస్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. జూమ్ ఆప్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. కన్వీనర్‌గా షబ్బీర్ ఆలీ సమావేశాన్ని కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మిగిలిన పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ .. పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను కింది స్థాయి నుంచి చేపట్టాలని పిలుపునిచ్చారు.
Read Also:పీఆర్సీ పై ముగిసిన జగన్ సమీక్ష
రాబోయే రోజులలో ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలు, జన జాగరణ పాదయాత్రలను విస్తృతంగా జరపాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఏఐసీసీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలలో నాయకులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.జనవరి 10వ తేదీ నుంచి నిర్వహించే ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. నాయకులందరూ పార్టీలైన్‌లో క్రమశిక్షణతో పనిచేయాలని మానిక్కమ్ ఠాగూర్ పేర్కొన్నారు.
సమావేశంలో జగ్గారెడ్డితో సహా నేతల కీలక వ్యాఖ్యలు
నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని నా వల్ల ఇబ్బంది అయితే తప్పుకుంటా అని చెప్పారు జగ్గారెడ్డి . అయితే, తప్పుకోవడం ఎందుకు…పొరపాట్లు సరిదిద్దుకుని పని చేసుకుని పోవాలి అని సర్దిచెప్జాపారు జానారెడ్డి, శ్రీధర్ బాబు. ఎవరికి వారు మాట్లాడుకుంటూ పోతే.. పార్టీకి నష్టం కాదా..? అని జానారెడ్డి అన్నారు. ప్రతీది అందరికి చెప్పాలని అనడం సరికాదని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అందరూ వస్తున్నారు… నాకు సమాచారం ఇస్తున్నారా..? అని పరోక్షంగా జగ్గారెడ్డిని ఉద్దేశించి అడిగారు అంజన్ కుమార్.. పదవితో కాదు… నేను కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని తెలిపారు జగ్గారెడ్డి. మనం మనం కొట్టుకోవడం కోసం కాదు మీటింగులు అని సర్దిచెప్పారు మధు యాష్కీ. పార్టీ యాక్షన్ ప్లాన్ పై చర్చ చేయండి. అంతర్గత సమస్యలు… అంతర్గతంగా చర్చ చేసుకోవాలని మధు యాష్కీ సూచించారు.
