పీఆర్సీ పై ముగిసిన జగన్‌ సమీక్ష

ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష ముగిసింది.సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పీఆర్సీ పై చర్చించారు. ఉద్యోగ సంఘాలతో చేసిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా పలు డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్‌మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం సమాలోచనలు జరిపారు.

Read Also:కస్టమ్స్‌ సుంకం ఎగవేసిన షావోమి.. కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు

ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశంపై సీఎం జగన్‌కు ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ మరోసారి చర్చలు జరుపనున్నారు. అనంతరం ఫిట్‌మెంట్‌ ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ స్పష్టత రాలేదు. దీనిపై ఉద్యోగులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పీఆర్సీని నాన్చుతు ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.

Related Articles

Latest Articles