మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ చార్జీ వరప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు దాడి చేయడాన్ని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల చేతిలో లా అండ్ ఆర్డర్ ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. బీఎస్పీ కార్యకర్తలపై దాడులకు దిగితే ఇకపై ఊరుకునేది లేదు.. ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Girija Shetter: నాగార్జునకు ఏకధాటిగా లిప్ కిస్ పెట్టిన హీరోయిన్.. ఇలా మారిపోయింది ఏంటీ ..?
ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్న తెలంగాణ హోం మంత్రిని బర్తరాఫ్ చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెల్లంపల్లి పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలి ఆయన తెలిపారు.
Read Also: Bhagavanth kesari: అబ్బే ఫ్రీమేకూ కాదు రీమేకూ కాదు.. భగవంత్ కేసరి ఆన్ డ్యూటీ అంట!
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. శేజల్ అనే అమ్మాయిని వేధిస్తున్నాడని నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్న కనీసం పోలీసులు పట్టించుకోవడం లేదు అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు పేకాట ఆడుతూ గంజాయి మత్తులో తూలుతుంటే పోలీసులు పట్టించుకోవడంలేదు.. పోలీసుల పనితీరు బీఆర్ ఎస్ కార్యకర్తలకు వత్తాసు పలికేలా ఉందని ఆయన విమర్శించారు. దాడి చేసిన వాళ్ళు బాధితులు అయ్యారు.. దెబ్బలు తిన్న వ్యక్తినే బెల్లంపల్లి పోలీసులు నిందితుడిగా చేర్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది.. స్వయాన హోమ్ మంత్రి ఆపదలో ఓ వ్యక్తి ఫోన్ చేసినా ప్రాణాలు నిలపలేదు అంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు.