Koturi Manavatha Roy: రేవంత్ రెడ్డి సీఎం కావాలని సత్తుపల్లి నుండి భద్రాద్రి రాములోరు వద్దకు కాంగ్రెస్ నేత మానవతారాయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో డిసెంబరు 12,13 తేదీల్లో పాదయాత్రకి మాజీ ఆత్మకమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ, ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ గాదె చెన్నకేశవరావులు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఈ పాదయాత్ర వేంసూరు మండలం మర్లపాడు నుండి సత్తుపల్లి, పెనుబల్లి కల్లూరు తల్లాడ,కొత్తగూడెం పాల్వంచ, బూర్గంపాడు, సారపాక మీదుగ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చేరే విధంగా మొత్తం150 కిమీ పాదయాత్ర వారం రోజులు కొనసాగే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ సత్తుపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఈ మేరకు సమాచారం అందించారు.
Read also: Elon Musk On BlueTick: ట్విట్టర్ బ్లూ టిక్… ఎలాన్ మస్క్ ఏమన్నారంటే?
మర్లపాడు నుండి భద్రాచలం వరకు కలిసి పాదయాత్ర చేయాలనుకునే సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు ముందుగా సత్తుపల్లి మానవతారాయ్ క్యాంప్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకునే విధంగా త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తారని సమాచారం. మానవతారాయ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి భద్రాచలం రాములోరి గుడి వరుకు 2010వ సంవత్సరంలో చేసిన పాదయాత్ర సఫలమైంది. అయితే మానవతారాయ్ చేసే ఈ పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి తప్పక సీఎం అవుతారని సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Manushi Chhillar: పెళ్లైన వ్యక్తితో మానుషీ డేటింగ్.. అడ్డంగా దొరికారు
