రేవంత్ రెడ్డి సీఎం కావాలని సత్తుపల్లి నుండి భద్రాద్రి రాములోరు వద్దకు కాంగ్రెస్ నేత మానవతారాయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో డిసెంబరు 12,13 తేదీల్లో పాదయాత్రకి మాజీ ఆత్మకమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ, ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ గాదె చెన్నకేశవరావులు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు.