హన్మకొండలో భూవివాదంలో న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన చేస్తున్నాడు శ్రీనివాస్ కాలనీకి చెందిన జంగిలి విజేందర్. బాధితుడి మద్దతుగా సెల్ టవర్ క్రింద నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితుడి భార్య ఇద్దరు పిల్లలు. హన్మకొండ శ్రీనివాస్ కాలనిలో 10 లక్షలు పెట్టి కొన్న ఇల్లు 3 ఏళ్ల తర్వాత మాదంటూ వేరేవాళ్ళు రావడం.. ఇల్లు అమ్మిన వ్యక్తి నాకు ఇల్లు అమ్మి 3 ఏళ్ళు అయ్యింది నాకు సంబంధం లేదు మేరే తేల్చుకోండి అనడం. పోలీసులు ..ప్రజా ప్రతినిధుల దగ్గరకు వెళ్లిన న్యాయం జరగలేదని టవర్ ఎక్కాడు బాధితుడు. ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తి నుండి న్యాయం కావాలంటున్నారు బాధితుడి కుటుంభ సభ్యులు.