Assault on lift giver: దొంగలు తమ వైఖరి మార్చుకోరు. ఏదో అనుకోని పరిస్థితుల్లో దొంగతనాలు చేశారని అనుకున్నా.. పదే పదే అదే పని చేస్తుంటే వారిని ఏమనాలి? దొంగతనాలకు పాల్పడటమేకాదు వారిపై దాడిచేసి ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ వారిపై పోలీసులకు సమచారం అందిస్తారేమో అనే భయంతో వారిప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు దుండగులు. ఈకాలంలో సహాయం చేసినా పాపంగా మారుతుంది. వారికి కావాల్సిందే తీసుకొని దాడిచేసి ప్రాణం తీస్తున్నారు. సహాయం చేసిన కృతజ్ఞత కూడా నోచుకోని పరిస్థితుల్లో మన సమాజం వుందనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి ని బైక్ పై వెలుతుండగా రోడ్డుపై వున్న మరోవ్యక్తి లిప్ట్ అడిగాడు. లిప్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఇంజెక్షన్ తో దాడి చేసి పరారీ అయ్యాడు. ఇంజెక్షన్ దాడి కి గురైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జామాల్ సాహెబ్ అనే వ్యక్తి బానాపురం వద్ద నుంచి వెళుతుండగా ఓ వ్యక్తి లిప్ట్ అడిగాడు. లిప్ట్ అడిగిన వ్యక్తి వెనక కూర్చున్నాడు. ఇంతలోనే బైక్ వెనుక కూర్చన వ్యక్తి ఇంజెక్షన్ తో దాడికి పాల్పడ్డాడు. దీంతో జామాల్ బండి మీద నుంచి క్రింద పడిపోయాడు. బండి వెనుక వున్న వ్యక్తి బైక్ తో పరారయ్యాడు. అయితే గుర్తించిన స్థానికులు జమాల్ ను హుటా హుటిన వల్లబి ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. జమాల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా సరే పరిచయం లేని వ్యక్తులకు లిప్ట్ ఇవ్వొద్దని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు.
Somu Veerraju: కుటుంబ పార్టీలను తరిమేస్తాం.. బీజేపీ ప్రజాపోరు యాత్ర షురూ