మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మొదట నువ్వు రాజీనామా చేసి… మా దళితులకు దళిత బందు..డబుల్ బెడ్ రూం ఇప్పించు. నువ్వు రాజీనామా చెయ్… పోటీ చేస్తే గెలిపిస్తాం. ఇంకో ఏడాది అయినా..నేను ఖాళీగా ఉంటా… మా దళితులు బాగు పడితే చాలు అన్నారు. దళితులు బాగు పడతారు అంటే. నేను పోటీ కూడా చెయ్యను. దళిత బందు..డబుల్ బెడ్ రూం ఇప్పించు అని తెలిపారు.
కానీ ఇలాగె ఉంటె మంచి రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 30 శాతం ఓట్లు కూడా రావు. కేసీఆర్ పెంపుడు కుక్క మంచి రెడ్డి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. మంచిరెడ్డి సొంత ఊరు నుండే నిన్నటి సభకు వేల మంది వచ్చారు. పోలీస్ స్టేషన్ దగ్గర దళితులకు ఇచ్చిన భూమి.. 500 కోట్లకు కొట్టేసాడు అని పేర్కొన్నారు.
