Mallu Ravi Gives Clarity Why He Not Attend Cyber Crime Enquiry In Congress War Room Case: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి.. నేడు విచారణకు హాజరు కాలేదు. పార్టీపరమైన సమావేశాల కారణంగానే తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని స్పష్టం చేశారు. మల్లు రవి మట్లాడుతూ.. ఈరోజు విచారణకు రావాలని తనకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే.. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు తనకు మీటింగ్ ఉందని, అందుకే తాను విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం తెలియజేశానని తెలిపారు. సంక్రాంతి పండగ తర్వాత ఏదైనా తేడీ ఫిక్స్ చేస్తే, అప్పుడు తప్పకుండా హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని అన్నారు. తనపై కేసు నమోదు చేశారని తెలుస్తోందని, దీనిపై తనకు సమాచారం అందలేదని పేర్కొన్నారు. తాము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కేవలం విమర్శించడానికే తప్ప.. అవమానించడానికి కాదని క్లారిటీ ఇచ్చారు.
Delhi Liquor Scam: స్పెషల్ కోర్టులో అభిషేక్ వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ
కాగా.. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని.. ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో సునీల్ కనుగోలుతో పాటు ఆయన కింద పని చేస్తున్న మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా.. సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ధ్రువీకరించారు. సునీల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా.. సీఆర్‌పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేస్తూ, ఈనెల 12న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..