Site icon NTV Telugu

Mallu Ravi: కాంగ్రెస్‌ సీనియర్లకు కౌంటర్‌.. కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చినవాళ్లు ఎంతమంది..?

Mallu Ravi

Mallu Ravi

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెట్టింది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఈ పరిస్థితులకు నిరసనగా ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా చేస్తే.. సీనియర్లు సమావేశం కావడం.. పీసీసీ కమిటీలపై బహిరంగంగానే మాట్లాడుతుండడం.. గందరగోళానికి దారితీసింది.. తాజాగా కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమయ్యారు.. ఆ సమావేశానికి మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, దామోదరం రాజనరసింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక, రేవంత్‌పై ఆదినుంచి అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. వారికి మద్దతు తెలపడం హాట్‌ టాపిక్‌ అయ్యింది.. అయితే, కాంగ్రెస్‌ సీనియర్లకు కౌంటర్‌ ఇచ్చారు మరో సీనియర్‌ నేత మల్లు రవి.

Read Also: MLA Raghunandan Rao : రోహిత్‌ రెడ్డికి ఇంకో గెస్ట్ హౌస్ ఉంది… ఆ గెస్ట్ హౌస్‌కు సినిమా వాళ్ళు వస్తుంటారు

ఏ కమిటీల్లో ఎవరి సంఖ్య ఏ స్థాయిలో ఉందే చెప్పుకొచ్చారు మల్లు రవి.. 22 మందితో ఉన్న పీఏసీ కమిటీలో రేవంత్‌రెడ్డి మినహా టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేసిన ఆయన.. ఇక, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు.. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారని.. 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో ఐదుగురు టీడీపీ నుండి వచ్చినవాళ్లకు చోటు కల్పించారి.. డీసీసీ అధ్యక్షుల్లో అసలు ఒక్కరు కూడా టీడీపీ నుండి వచ్చినవాళ్లు లేరని స్పష్టం చేశారు.. ఇక, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కమిటీలో 68 శాతం అవకాశాలు కల్పించారని.. ఓసీలు 32 శాతం ఉన్నారని చెప్పుకొచ్చారు. మొత్తంగా కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చినవాళ్లకు అవకాశం కల్పించడాన్ని పేర్కొంటూ.. సీనియర్‌ నేతల ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు మల్లు రవి.

Exit mobile version