Mallu Bhatti Vikramarka Comments On CM KCR: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. భద్రాచలం ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ భద్రాచలంకు చేసిందేం లేదని వ్యాఖ్యానించారు. కాలేజీలు, ఆసుపత్రులు, చివరకు గోదావరి నదిపై బ్రిడ్జి కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.125 కోట్లతో భద్రాచలానికి మంచినీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతకాలని అటవీ హక్కుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ అని, 3 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిందీ కాంగ్రెస్ పార్టీనేనని చెప్పుకొచ్చారు. కానీ.. దశాబ్దకాలంగా నీళ్లు రాలేదని, నియామకాలూ జరగలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏడు మండలాలు బిల్లులో పెట్టకపోయినా, దొంగచాటుగా బీజేపీ ఆర్డినెన్స్ ఇచ్చిందని మండిపడ్డారు. ఉన్న భద్రాచలాన్ని కూడా కేసీఆర్ మూడు ముక్కలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: ‘మేం ఓట్లు అడగం’.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
ఇదిలావుండగా.. త్వరలోనే తాను పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటిస్తానని భట్టి విక్రమార్క సోమవారం తెలిపారు. ‘హత్ సే హత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సంబంధించి, తన పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్‌ను త్వరలోనే ప్రకటిస్తానన్నారు. కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలోనూ తాను పాల్గొంటానని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం మార్చి 1వ తేదీ నుంచి పాదయాత్ర లేదా బైక్ యాత్ర చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. అటు.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా తెలిపారు. తనను ఎవరైనా పాదయాత్రకు రావాలని ఆహ్వానిస్తే, తప్పకుండా వెళ్తానని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.
Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు