Site icon NTV Telugu

Bhatti Vikramarka: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై చర్చించాం.. అంతా సర్దుకుంది

Bhatti Vikramarka On Revant

Bhatti Vikramarka On Revant

ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తాము కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలన్నీ సర్దుకున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో.. మోదీ పర్యటన ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య దోస్తీ బయటపడిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశిస్తే, నిరాశే మిగిలిందన్నారు.

ఇదిలావుండగా.. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈ నెల 2వ తేదీన హైదరాబాద్‌కి వచ్చినప్పుడు, ఆయనకు స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొనవద్దని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే, వారిని బండకేసి కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన జగ్గా రెడ్డి.. తామేమైనా రేవంత్ రెడ్డి పాలేర్లమా అంటూ ఫైరయ్యారు. టీపీసీసీ చీఫ్ పదవి నుండి రేవంత్ రెడ్డిని తొలగించాలని కోరుతూ తాను పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని, త్వరలోనే సంచలన ప్రకటన కూడా చేస్తానని ఈ నెల 3వ తేదీన జగ్గారెడ్డి ప్రకటించారు. ఇప్పుడదంతా సద్దుమణిగిందని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version