NTV Telugu Site icon

Malla Reddy: నేను.. రేవంత్ మిత్రులం.. కలిస్తే తప్పేంటి..!

Malla Reddy

Malla Reddy

Malla Reddy: సీఎం రేవంత్, నేను ఇద్దరం కలిస్తే తప్పేంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో మల్లా రెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ పోటీ చేయనని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను.. రేవంత్ పాత మిత్రులమని, టీడీపీ వాళ్ళమని తెలిపారు. కీసర ఆలయం కార్యక్రమంకు పిలిచెందుకు సీఎం రేవంత్ ను కలుస్తాం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నీ కలిస్తే తప్పు ఎందుకు ? ఆయన రాష్ట్రానికి సీఎం కదా ? అన్నారు. త్వరలో గోవాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ప్రకటించారు. ఇప్పటికే గోవాలో హోటల్ కొన్నానని అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్లో అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం వాళ్లకు షాక్.. మేము రాకపోవడం మాకు షాక్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Animal Park : ‘యానిమల్ పార్క్’కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే..?

తాజాగా మేడ్చల్ బీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి.. ఇదే తనకు చివరి టర్మ్ . ప్రస్తుతం 71 ఏళ్ల వయసున్న మల్లారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు అండగా నిలిచిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. కార్యకర్తలు, ప్రజల అండదండలతో ఒకసారి మంత్రిని కూడా చేశానని మల్లారెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు 95 శాతం న్యాయం జరిగిందని మల్లారెడ్డి అన్నారు. భవిష్యత్తులో ప్రజాసేవ చేస్తానన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మల్లారెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇక ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Animal Park : ‘యానిమల్ పార్క్’కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే..?