NTV Telugu Site icon

Alleti Maheshwar Reddy: పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Maheshwer Reddy

Maheshwer Reddy

Alleti Maheshwar Reddy: పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడి ఆరు నెలలైనా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం, సీఎం కి మూడు రోజుల క్రితం బహిరంగ లేఖ రాశానని తెలిపారు. ఏపీ లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై సంతకం పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పెన్షన్లను 2 వేల నుంచి 4 వేలు పెంపు చేస్తూ సంతకం పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్లు 4 వేలు చేస్తా అన్నారు.. ప్రభుత్వం ఏర్పడి 6 నెలులు అయింది…రేవంత్ రెడ్డి మర్చిపోయారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. ఏపీ రాష్టం ఆర్థిక సంక్షోభంలో ఉన్న, ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గత పెన్షన్ కలిపి 7 వేలు ఇస్తా అన్నారని తెలిపారు.

Read also: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్‌.. భూకబ్జా కేసు నమోదు..

ఆరు నెలల పెన్షన్ కలిపి మొత్తం వృద్దులకు 12 వేలు పెన్షన్ ఇవ్వాలి రేవంత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 1 తరగతి నుంచి 10 తరగతి వరకు పంపిణీ చేసే పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానా పై మరో భారం పడుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన కేసీఆర్ బొమ్మ పుస్తకాల పై వచ్చి ఉండొచ్చు, వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఇచ్చిన పుస్తకాలు తీసుకోవద్దని అన్నారు. పుస్తకాల పై జాతీయ గీతం ఉందని తెలిసింది దాన్ని తీసేయడం మంచి పద్దతి కాదన్నారు. ఏపీ లో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్న పుస్తకాలు పిల్లలకు ఇచ్చారన్నారు. ఆశ వర్కర్లకు జీతాలు రావడం లేదు..వారి జీతాలు పెంచుతామని రేవంత్ అన్నారని తెలిపారు. అధ్యక్షుడు మార్పు పై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బీజేపీ రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిని చూశారన్నారు. ప్రజలు మా వైపు ఉన్నారని, ఏ స్కాం జరిగిన దానిపైన విచారణ జరగుతుంది.
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్‌.. భూకబ్జా కేసు నమోదు..