Maheshwar Reddy: ఉత్తమ్ కుమార్ పై బీజెఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. నేను సంధించిన 19 ప్రశ్నల్లో ఒక్కదానికే మంత్రి ఉత్తమ్ సమాధానం ఇచ్చారన్నారు. సన్నబియ్యం కొనుగోలు విషయంలో మా సూచన తీసుకున్నందుకు ధన్యవాదాలన్నారు. మంత్రి ఉత్తమ్ ఫ్రస్ట్రేషన్ లో దిగజారుడు మాటలు మాట్లాడారని తెలిపారు. నాయకుడిని తయారు చేసే, సామర్ధ్యం ఉన్న నేతలకు పదవులు ఇచ్చే పార్టీ బీజేపీ అన్నారు. మీరు పిసిసి పదవి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టింటి వ్యవహారం మేనమామకు ఎరుక అన్నట్లు ఉత్తమ్ చరిత్ర నాకు తెలుసన్నారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎం రేవంత్ ను కలిసి ధాన్యం కొనుగోలుపై వినతి పత్రం ఇచ్చామన్నారు. రైస్ మిల్లర్లు 22 వేల కోట్లు బకాయిలు ఉన్నారని మీరే చెప్తున్నారని గుర్తు చేశారు.
Read also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
డిఫాల్టర్ల లిస్ట్ ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. వేల కోట్ల ప్రజాధనం ఉన్న అంశంలో బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తరుగుపై ఎప్పుడైనా మంత్రి కల్లాలకు వెళ్లి పరిశీలించారా ? అని ప్రశ్నించారు. జీఓ నెంబర్ 1, కమిటీ ఏర్పాటు, భేటీ, గైడ్ లైన్స్ ఒకేరోజు ఎలా సాధ్యం అయ్యాయి? అని ప్రశ్నించారు. మిల్లర్లతో వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఆ బాండ్ పేపర్ బయట పెడుతున్న. మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలన్నారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లిఫ్ట్ చేసేందుకు కాంట్రాక్టర్ల కు టెండర్ ఇచ్చారన్నారు. 90 రోజులైన వాళ్లు లిఫ్ట్ చేయడం లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా? అని ప్రశ్నించారు. పర్సనల్ గా మాట్లాడితే బాగోదన్నారు. నిన్న వేలు చూపుడేతు మంత్రి మాట్లాడారు. ఇక్కడ భయపడే వారు ఎవరు లేరన్నారు. సివిల్ సప్లై అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు..