Kaleshwaram Commission : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా తప్పుబట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ స్పష్టంగా చెప్పింది – కేసీఆర్ దోషి. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు,” అని ఆరోపించారు.
ఇంజనీర్లు సూచించిన సాంకేతిక అంశాలను పక్కన పెట్టి, తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నాడని విమర్శించారు. “తనకు ఇష్టం ఉన్న చోటే ప్రాజెక్టు కట్టాలని ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారు… ఇది చిన్న విషయం కాదు,” అని అన్నారు.
Rajnath Singh: దమ్ముంటే ఆ ‘‘అణుబాంబు’’ పేల్చు.. రాహుల్ గాంధీకి రాజ్‌నాథ్ సవాల్..
“ఈ కార్ రేస్‌లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా? ప్రభుత్వ సొమ్ము తిన్న వారు కక్కక తప్పదు,” అని హెచ్చరించారు. అలాగే, “సుతి లేని సంసారం చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశావు. కేసీఆర్ కుటుంబం అంటే అబద్ధాల పుట్ట,” అని తీవ్రంగా దుయ్యబట్టారు.
“మీ చేతకానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్టు వస్తోంది. మేము మేల్కొని ఫిర్యాదు చేశాకే ప్రాజెక్టు పనులు ఆగాయి,” అని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాశ్వత నష్టం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. “కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సహజం. గ్రూపులు ఉండాలి. పాత నీరు, కొత్త నీరు కలిసే పార్టీ బలంగా ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో అందరూ ఒక్కటై పార్టీ విజయం కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. “గ్రూపుల వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవడం మా బాధ్యత,” అని చెప్పారు.
Kuppam: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. త్రుటిలో తప్పించుకున్న మహిళలు..
