Site icon NTV Telugu

Mahesh Kumar Goud : అక్కడ టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున భూములు కొన్నారు

PCC Working President Mahesh Kumar Goud Reacts On 111 G.O.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిన్న నిరవధిక వాయిదా పడ్డాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున సీఎం కేసీఆర్‌ 111 జీవోను ఎత్తివేస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారికి 111 జీవో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 111 జీవోపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లోపాయికారి సమాచారంతో రైతుల నుంచి టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున భూములు కొన్నారని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా ఏడేళ్ల పాటు టీఆర్‌ఎస్‌ పెద్దలు అంత రైతుల నుంచి భూములు కొన్నాక ఇప్పుడు 111 జీవో ఏతేవేస్తున్నట్లు ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షులతో పార్టీలో లోతుగా చర్చ జరిపి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. రైతులు తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయం చేసి చెరువుల పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

https://ntvtelugu.com/nsui-protest-at-tspsc-office/
Exit mobile version