NTV Telugu Site icon

CM Revanth Reddy: సీఎం సొంత జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

Cm Revanth

Cm Revanth

మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో మొత్తం రూ. 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో.. రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అంతేకాకుండా.. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరోవైపు.. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Read Also: Minister Seethakka: గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..

అటు.. దేవరకద్రలో రూ.6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ రూరల్ లో రూ. 3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గండీడ్ లో రూ. 6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన.. పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Read Also: Kandula Durgesh : గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే

అంతకుముందు.. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు సీఎం సమీక్షలో పాల్గొన్నారు.