NTV Telugu Site icon

DK Aruna: రైతు రుణమాఫీ పై కండిషన్స్ అంటే ఎలా?.. డీకే అరుణ ఫైర్‌..

Dk Aruna Vs Revanth Reddy

Dk Aruna Vs Revanth Reddy

DK Aruna: నిబంధనలు లేవని కండిషన్స్ అంటే ఎలా అని రైతు రుణమాఫీపై డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. మహబూబ్ నగర్ లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై MP డీకే అరుణ మండిపడ్డారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటోందని ఫైర్ అయ్యారు. వరంగల్ డిక్లరేషన్ లో ఏలాంటి నిబందనలు లేకుండా ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం అంటూ లేనిపోని కండిషన్స్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభూత్వానికి చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పుర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తిస్థాయిలొ రుణమాఫీ అమలు చేసే వరకు రైతుల తరపున బీజేపీ పోరాడుతుందన్నారు.

Read also: Breaking News: అప్పటి నుంచే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్‌

* భూ వ్యవసాయ భూమి కూడా కలిగి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది.

* 12-12-2018 తర్వాత నుంచి రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ.

* రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి.

* 2 లక్షలకు పైబడి ఉన్న రుణాలకు బ్యాంకులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

* 09-12-2023 తర్వాత రెన్యువల్ చేసిన రుణాలకు పథకం వర్తించదు.

* పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది.

* మహిళల పేరు మీద ఉన్న రుణాలకు ప్రయారిటీ.

* మొదటగా మహిళల పేరు మీద ఉన్న రుణాలను మాఫీ.

* పథకం అమలుకు ఐటి భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్.

* రుణమాఫీ అమలకు ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారి.

* ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లు నుంచి పథకం వర్తింపు.

* ఈ పథకం క్రింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంటరుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులుకారని కనుగొన్నట్లయితే, పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టప్రకారం వ్యవసాయశాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది. 

CPM Srinivasa Rao: గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు.. జీవో 590 రద్దు చేయాలి..